డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్…
DSC Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని ప్రకటించింది. Komatireddy Venkat Reddy : కేసీఆర్ పై…
CM Revanth Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ…
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11,000 డీఎస్సీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మంగళవారం విద్యా శాఖ వివిధ జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కోర్టు కేసులు , ఇతర కారణాల వల్ల ఇంకా…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు..…