Off The Record: ప్రభుత్వాన్ని కొంతవరకు నడుపుతోంది కన్సల్టెంట్లే కదా..? అంతా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది కదా…? ఇదీ… ఇటీవల ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్య. జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకుని అన్నారో… లేక స్వయంగా ఆయనే ఇబ్బంది పడ్డారోగానీ…దాని గురించే ఇప్పుడు పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కన్సల్టెంట్స్… సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారో…. అప్పుడే పార్టీ నాయకులు మంత్రుల సహజ శైలి మరుగునపడిపోయిందని, సందర్భానుసారం స్పాంటేనియస్‌గా స్పందించలేకపోతున్నారన్నది పార్టీ వర్గాల…
Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది.. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్రియాశీల క్షేత్రస్ధాయి నాయకత్వం ఉంది..…
Off The Record: విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు, మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావిడి, పబ్లిసిటీతో అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకోగా… ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి బాగా….. ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో…
Off The Record: కడప జిల్లాలో కడప నగరం తర్వాత అత్యంత పెద్దది ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారానికి పాపులర్. అందుకే దీన్ని చిన్న ముంబై అని కూడా పిలుచుకుంటారు స్థానికంగా. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తహతహలాడుతుంటాయి, రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి అన్ని పార్టీలు. ఇక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే.. ఆ లెక్కే వేరు. 2024లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున గెలిచారు సీనియర్ లీడర్ వరదరాజులురెడ్డి. కానీ… ఇప్పుడాయన పేరుకు…
Off The Record: ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే సమస్య…. నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే….. అన్న బాలకృష్ణ డైలాగ్ ఇప్పుడు టీడీపీకే అప్లయ్ అవుతోందన్న టాక్ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. బాలయ్య అసెంబ్లీలో నోరు తెరిచినా… ఆయన అభిమానులు హిందూపురంలో ప్లకార్డ్‌లు ప్రదర్శించినా… అంతిమంగా ఇరుకున పడుతోంది మాత్రం పార్టీనే ఆయన సినిమా డైలాగ్‌ను అప్లయ్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ ఊసు లేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలతో సతమతం అవుతున్న…
Vidadala Rajini: కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయడం మానేసింది.. సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణపైనే దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హాస్టల్స్ లో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని మండిపడ్డారు.. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను పరామర్శించారు. కురుపాం, అనపర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు.…
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని విమర్శించారు. కనీసం మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, తట్టమట్టి తీయలేదని మండిపడ్డారు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని, మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాం అని మంత్రి చెప్పారు. కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించాడు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు,…
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న హెపటైటిస్ ప్రభావిత విద్యార్థినులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి ఈరోజు పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలతో మంత్రి మాట్లాడారు. వారి ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన పిల్లలకు నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు కొందరు హెపటైటిస్–ఏతో బాధపడుతున్న విషయం…
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు.
Off The Record: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నది సామెత. ఇప్పుడు ఏపీ లిక్కర్ ఎపిసోడ్లో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న వాళ్ళంతా… ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారట. ఎవరు దొంగలు, ఎవరు దొరలు…. అసలు ఎవరిది పాతివ్రత్యం అంటూ…పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సామాన్య జనంలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున మద్యం కుంభకోణం చేసిందని ఆరోపిస్తున్న కూటమి పార్టీలు… అధికారంలోకి వచ్చాక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశాయి. ఈ…