రోడ్ల దుస్థితిపై మాజీ మంత్రి కామెంట్.. డాక్టర్ల ప్రాక్టీస్ పెరిగింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి అధికార పార్టీ నేతల మాటలే సాక్ష్యాలన్న ఆయన.. నేటి ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వక పంచాయతీ రాజ్ శాఖలో పనులు నిలిచిపోయాయన్నారు. 15 శాతం కమిషన్ ఇస్తే తప్ప కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించిన ఆయన.. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. స్టేట్ షేర్ కింద 10 శాతం కూడా కట్టలేని స్థితిలో రాష్ట్రం ఉందని.. రోడ్లు ఇంత దారుణంగా ఉంటే.. వచ్చే ఏడాదికి రోడ్లు వేస్తామని మంత్రి ఎలా చెబుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ మూత పడింది… ఆర్ధిక మంత్రి బుగ్గన రెస్టులోకి వెళ్లిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!