మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి…
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరికీ తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుప్పంలో వైసీపీ క్రమంగా బలపడుతుండగా టీడీపీ బలహీనమవుతోంది.…
బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని…
చంద్రబాబు ఒక పగటి వేషగాడు… పిట్టలదొర అని మంత్రి కొడాలి నాని అన్నారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా గొల్లపూడిలో ఘనంగా ఆసరా వారోత్సవాలు చెప్పటింది ప్రభుత్వ యంత్రాంగం. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గడచిన మూడున్నర దశాబ్ధాల్లో ఒక్క గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. పసుపు జెండాలుంటేనే పథకాలిచ్చారు. టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…
సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను తెలంగాణ అంబేద్కర్గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్‌గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ…
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై విద్యుత్ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల…
ఆయన ఏదో ఈక్వేషన్‌తో ఈయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు. అంతా బాగానే ఉంది. ఈయనేమో.. నేను అప్పుడు అయన అల్లుడికి అంత నష్టం చేసినా… ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారు అంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకే పరిమితమైన ఆ ‘మా’ గొడవ ఇప్పుడు రాజకీయంగా తమను ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట. మోహన్‌బాబు కామెంట్స్‌తో ఇరకాటంలో టీడీపీ..! మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా…