Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు, మహిళల హక్కులు వేర్వేరు కాదు.. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సమాజంలో వారిపై జరిగే దోపిడీ బాల్యం నుంచే ప్రారంభమై, తర్వాతి తరాలకు కూడా వ్యాపిస్తుంది. కేవలం పేదరికమే కాకుండా, లింగ వివక్ష, కఠినమైన సామాజిక ఆచారాలు ఈ వ్యవస్థీకృత సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం కూడా ఎక్కడో ఒక దగ్గర బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల నష్టపోయేది వారి తల్లిదండ్రులతో పాటు.. పెళ్లి చేసుకున్న ఆ బాలిక కూడా.
పేదరికం వల్ల కుటుంబాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటాయి. బాల్య వివాహం అనేది పేదరికానికి ఫలితంగానూ, అలాగే మరింత పేదరికానికి కారణంగానూ మారుతోంది. పెళ్లి తర్వాత బాలికలు విద్యకు, ఉపాధి శిక్షణకు దూరమవుతారు. దీనివల్ల వారు కేవలం గృహనిర్వహణకే పరిమితమై, భర్త సంపాదనపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్యం సంభవిస్తే, ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడుతుంది. వరకట్న వేధింపులు కూడా బాల్య వివాహాలను మరింత ప్రోత్సహిస్తున్నాయి.
Also Read
- India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
- Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
మానసిక ఇబ్బందులు..
చిన్న వయసులోనే వివాహం కావడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్య లేకపోవడం వల్ల సమాజంలో వారి స్వయంప్రతిపత్తి, నిర్ణయాధికారం కోల్పోయి అణచివేతకు గురవుతారు. ఇలా బాల్య వివాహానికి గురైన మహిళలు, తమ పిల్లల హక్కుల కోసం లేదా వారికి మంచి విద్యను అందించడం కోసం పోరాడలేరు. ఫలితంగా వారి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా అదే పేదరికంలోకి, బాల్య వివాహాల కూపంలోకి నెట్టబడుతున్నారు. సమాజంలో ఆచారాల పేరిట ఉండే ఒత్తిళ్లు, బహిష్కరణ భయాలు తల్లిదండ్రులు ఈ తప్పును కొనసాగించేలా చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు..
ఈ దురాచారాన్ని అడ్డుకోవడానికి సమగ్రమైన, బహుముఖ వ్యూహాలు అవసరం. పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు బాలికల విద్యపై పెట్టుబడులు పెట్టాలి. 2024 అక్టోబర్ 18న ‘సొసైటీ ఫర్ ఎన్లైటెన్మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. బాల్య వివాహాల నిరోధానికి రక్షణ, నివారణ, శిక్షల వంటి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను కోర్టు సూచించింది. బాల్య వివాహాల చట్టాన్ని సవరించి, పిల్లల నిశ్చితార్థాలను కూడా చట్టవిరుద్ధం చేయాలని సిఫార్సు చేసింది. బాల్య వివాహాలను ఒక సామాజిక ఆచారంగా కాకుండా, పిల్లలపై జరిగే ఘోరమైన నేరంగా పరిగణించినప్పుడే ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలం.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!