ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto Pad 70 Pro Launch: గత ఏడాది విడుదలైన Moto Pad 60 Proకు అప్డేటెడ్ గా Moto Pad 70 Proను జూన్ 27న అధికారికంగా లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ప్రీమియం ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ Moto Pad 70 Proలో 13-అంగుళాల MaxVision డిస్ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ టెక్నాలజీతో వీడియోలు మరింత స్పష్టంగా, జీవంతో కనిపిస్తాయి. ట్యాబ్లెట్ కేవలం 6.2 మి.మీ. మందంతో, 589 గ్రా. బరువుతో స్లిమ్ డిజైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇది బ్లూ కలర్ వేరియంట్లో లభించనుంది.
పనితీరు పరంగా ఇందులో Qualcomm Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి హై-స్పీడ్ LPDDR5X RAM అందించారు. గేమింగ్ లేదా హెవీ మల్టీటాస్కింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు 3-లేయర్ AI Max కూలర్ సిస్టమ్‌ను అందించారు. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్‌తో పాటు 2TB వరకు విస్తరించగల microSD కార్డ్ స్లాట్‌ను కూడా కల్పించారు. ఈ ట్యాబ్లెట్లో 10,200mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు ఆన్లైన్ వీడియో ప్లేబ్యాక్, 45 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందుతుందని కంపెనీ తెలిపింది. డివైస్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ, బాక్స్‌లోనే 68W టర్బో పవర్ ఛార్జర్‌ను అందించనున్నారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Moto Pad 70 Pro ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుంచి నేరుగా రానుంది. ఈ ట్యాబ్లెట్‌కు ఆండ్రాయిడ్ 19 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, 2030 వరకు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది. అలాగే Moto AI ఫీచర్లతో పాటు గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, జెమినీ వంటి ఆధునిక AI టూల్స్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పలు డివైస్ల మధ్య సులభంగా కనెక్టివిటీ కల్పించబడుతుంది. ఇందులో క్రాస్-స్క్రీన్ స్ట్రీమింగ్, షేర్డ్ క్లిప్‌బోర్డ్, వేగవంతమైన ఫైల్ ట్రాన్స్ఫర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఆడియో అనుభవాన్ని మెరుగుపరచేందుకు JBL ట్యూన్ చేసిన క్వాడ్ స్పీకర్ సెటప్‌ను డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో అందిస్తున్నారు. అంతేకాకుండా బాక్స్‌లోనే Moto Pen Pro స్టైలస్‌ను అందించడం విశేషం. ఎంపిక చేసిన వేరియంట్లలో ట్రాక్ ప్యాడ్‌తో కూడిన డిటాచబుల్ కీబోర్డ్ కూడా లభించనుంది. దీంతో ట్యాబ్లెట్‌ను PC మోడ్ లో ఉపయోగించి ల్యాప్‌టాప్ తరహా అనుభవాన్ని పొందవచ్చు. దీనిని జూన్ 27 నుంచి భారత మార్కెట్లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రిటైల్ స్టోర్లలో ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ధర వివరాలను కంపెనీ లాంచ్ రోజున ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!