దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు.
ఫ్లెక్సీ వార్ పై వర్గపోరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించారు. తెలుగు తమ్ముళ్లు ఒక మహిళా సర్పంచ్ పై దాడికి దిగడం ఆ పార్టీ దిగజారుడు తనాన్ని బయటపడుతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా.. వారి వర్గపోరు బహిర్గతం అవుతుందని అన్నారు. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర.. యువగళం కాదని గొడవలగళంగా వర్ణించారు.
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు.