Gudivada Amarnath: చంద్రబాబుకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం..! లాలూ ప్రసాద్‌ను జైల్లో పెట్టలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం అని వ్యాఖ్యానించారు.. లాలూ ప్రసాద్ యాదవ్ తప్పు చేస్తే జైల్లో పెట్టలేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. ఆన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు చేసిన పాపాలు, దోపిడీకి అరెస్ట్ ఒక నిదర్శనంగా అభివర్ణించారు. రూ. 370 కోట్ల ప్రజాధనం వ్యక్తిగత స్వార్ధం కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. కాస్టోడియన్ గా ఉండాల్సిన ప్రజాప్రతినిధి కంచె చేను మేసినట్టు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లో బయటపడిందన్నారు.
చంద్రబాబు తేలుకుట్టిన దొంగ.. అందుకే నా తప్పు లేదని ఎక్కడా చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు మంత్రి అమర్నాథ్.. స్కిల్ స్కామ్ యూరో లాటరీ వంటి మోస పూరిత ఆలోచనల్లో నుంచి పుట్టిందన్న ఆయన.. చంద్రబాబు క్రిమినల్ స్కిల్ తప్ప రాష్ట్రానికి ఎటువంటి లబ్ది చేకూరలేదన్నారు. సీ మేన్స్ స్కామ్ లో ఎంత మంది పాత్రధారులు వున్నా.. ప్రధాన సూత్రధారి మాత్రం చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. ప్రజల ఆస్తిని దోపిడీ చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే ఆందోళన చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా..? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయమన్న ఆయన.. లాలూ యాదవ్ తప్పు చేస్తే జైల్లో పెట్టలేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత రాజకీయ అనుభవం ఉన్న నేతైనా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని.. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు అన్నీ స్కామ్ లే అన్నారు.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ఇక, పురంధేశ్వరికి బ్రదర్-ఇన్-లా తప్పలా గురించి పట్టడం లేదు.. ఈడీ విచారిస్తున్న కేసులో చంద్రబాబు అరెస్ట్ చేస్తే మాట్లాడుతున్న పురంధేశ్వరి.. కానీ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావులుగా మాట్లాడుతున్న వాళ్లంతా ఈ స్కామ్ లో తమ వాటా ఎంతో చెప్పాలి అని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.. చంద్రబాబు చేసిన పాపాల ముగింపు ఒక రోజు వచ్చింది.. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నిధులు దోపిడీ వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబు అనేది తేలిన తర్వాత అరెస్టుకు శనివారం అయిన ఆదివారం అయినా ఒక్కటే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!