Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన పవన్ కల్యాణ్.. వాటికి సంపూర్ణ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు.. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అసలు ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుందని మండిపడ్డారు. గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు.. నేడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని ప్రకటించారు.
పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు అని హితవుపలికారు పవన్ కల్యాణ్.. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించింది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోమని అంటున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..? అధికార పార్టీకి సంబంధం ఏమిటి..? అని నిలదీశారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజం.. మీ నాయకులు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.. కానీ, వారి నాయకులను అరెస్టు చేస్తే.. ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదంటే ఎలా..? అంటూ మండిపడ్డారు పవన్.. లా అండ్ ఆర్డర్ కంటే కూడా.. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. చంద్రబాబు వీటి నుంచి బయటపడాలని జనసేన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?