Gudivada Amarnath: 75 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి అన్యాయాలు, అక్రమాల్లో జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నెక్స్ట్ ఖైదీ నెంబర్ పడేది లోకేష్ కే అని జోస్యం చెప్పారు.. దొంగ ఎప్పుడైన దొరక్క మానడు.. తమకు అనుకూల మైన వ్యవస్ధలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు.. చంద్రబాబు అక్రమ ఆస్తులు, స్కామ్‌లు బయటకు రావడం ఖాయం అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు చంద్రబాబు ఫ్యామిలీ సిద్ధమా..? ఛాలెంజ్ చేస్తున్నాం.. ఖైదీగా ఉన్న చంద్రబాబు మాట్లాడలేడు.. మా ఛాలెంజ్ కు లోకేష్ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఇక, చంద్రబాబు శేష జీవితం జైల్లోనే.. త్వరలోనే ఆయన కొడుకు జైల్లోకి వెళ్లడం ఖాయం అన్నారు మంత్రి గుడివాడ.
టీడీపీ రాష్ట్ర బంద్‌పై స్పందించిన మంత్రి అమర్నాథ్.. హెరిటేజ్ షాపులు ఓపెన్ అయ్యాయి.. జనం స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగితే బంద్ ఏ విధంగా జయప్రదం అయ్యినట్టు అని ప్రశ్నించారు. బందే లేనప్పుడు జయప్రదం ఎక్కడ.. టీడీపీ కార్యకర్త లే రోడ్డు మీదకు రాలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లాయర్ సరిపో డని పెద్ద జస్టిస్ చౌదరిలా కేసును వాదించుకుంటానని ఉపన్యాసాలు ఇచ్చాడట.. 75ఏళ్ల ఏపీ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి అన్యాయాలు , అక్రమాల్లో జైలుకు వెళ్లడం మొదటిసారి.. 45 ఏళ్ల రాజకీయ ల్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. అవినీతి దొంగ జైల్లో ఖైదీ నెంబర్ 7691.. నవయుగ వీరప్పన్ చంద్రబాబు.. ప్రజల సొమ్ము దోచేసాడు.. ఏలేరు స్కామ్ నుండి IGM భారథ్ స్టాంప్ ల కుంకోణం.. అమరావతి స్కామ్.. స్కిల్ స్కామ్.. ఫైబర్ స్కామ్.. సబ్ కాంట్రాక్ట్ 118 కోట్లా స్కామ్.. అంటూ ఆరోపణలు గుప్పించారు.
2 ఎకరాల భూమితో మొదలై.. వేళా కోట్ల అవినీతి దొంగ చంద్రబాబు.. నా తండ్రి తప్పు చెయ్యలేదు.. అని లోకేష్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు? అని ప్రశ్నించారు అమర్నాథ్.. అరెస్ట్ అయ్యింది మొదలు తప్పు చెయ్యలేదు అనే మాట ఎందుకు మాట్లాడలేక పోతున్నారు.. అరెస్ట్ విధానమే తప్పు పడుతున్నారు గాని.. తప్పు చెయ్యలేదు అని మాట్లాడలేక పోతున్నారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. సీ మెన్స్ సంస్థ పేరు చెప్పి స్కిల్ స్కామ్ డబ్బంతా.. దోచేశారు కాబట్టే రిమాండ్ వేసింది కోర్ట్.. ఛార్జ్ షీట్, రిమాండ్ రిపోర్టును న్యాయ స్థానం నమ్మింది కనుకే చంద్రబాబును జైలుకు పంపించింది.. చంద్రయాన్-4 తిరిగి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ల్యాండ్ అయ్యింది అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ పోలీసు ఆంక్షలు ఉల్లంఘించి హైడ్రామా సృష్టించారు.. సీమెన్స్ స్కామ్ లో పవన్ వాటా ఎంతో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. లోకేష్ కంటే ఎక్కువ బాధ పవన్ లో కనిపిస్తోంది.. విశ్వాసం అంటే ఎలా ఉండాలో పవన్ చూపించాడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.