అమరావతిలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశంపై రేపటి సభలోనూ పట్టు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, స్పీకర్ తమ్మినేని కామెంట్లపై సమావేశంలో చర్చించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'X' వేదికగా ఆయన మండిపడ్డారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
విశాఖలో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నుంచి రాజధాని కార్యకలాపాలను స్వాగతిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దసరా నుంచి పరిపాలన ప్రారంభిస్తున్న సీఎంకు మద్దతుగా నిలుద్దామని తెలిపారు. మరోవైపు టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ఖాజానాను టీడీపీ నాయకత్వం దోచేసిందని విమర్శించారు.