Kodali Nani: చంద్రబాబు అరెస్టైతే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడు అంటూ ఆయన విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది?.. రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా?.. లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడు.. మేం లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయం.. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు? అని కొడాలి నాని అడిగారు.
Read Also: Honey Rose: వైట్ డ్రెస్సులో పరువాలతో పిచ్చెక్కిస్తున్న హనీ పాప.. వైన్ గ్లాస్ తో రచ్చ..
Also Read
చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా? అని కొడాలి నాని సెటైర్ వేశాడు. అడెవడో స్టార్ వస్తే.. వాడిని లోకేష్ అన్నయ్య అంటాడు.. ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడు.. 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారు.. హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా? అని ఆయన ప్రశ్నించారు. తన భర్తకు వసతుల్లేవు.. వేణ్నీళ్లు లేవని భవనేశ్వరీ అంటున్నారు.. ఏసీలు.. ఫ్రీడ్జులు.. కూలర్లు.. బెడ్స్ ఉండడానికి అదేం ఇల్లు కాదు.. జైలు అంటూ వ్యాఖ్యనించారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలి.. చంద్రబాబు కాటికి కాలు చాపుకున్నాడు అని కొడాలి అన్నారు.
Read Also: Gudem Mahipal Reddy : గవర్నర్ ఆలోచనలు, విధానాలు బీజేపీ కార్యకర్త చేస్తున్నట్లే ఉంది
చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం మాకు తిరుగు లేదు అని కొడాలి నాని అన్నారు. జైల్లో ఉంటే దొమలు కుట్టక.. రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా?.. చంద్రబాబు ఏదో అరెస్ట్ అయ్యాడూ.. బాబ్బాబు మాట్లాడండంటూ కొందరు పక్క రాష్ట్రం నేతలను బతిమాలితే మాట్లాడారు.. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా?.. చంద్రబాబు కోసం ఎవ్వరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారు.. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మొళ్లు మాత్రమే.. మా వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయి.. పొరుగు దేశాలు.. రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా?.. చంద్రబాబు టీడీపీని కమ్మొళ్ల పార్టీగా మార్చారు అంటూ కొడాలి నాని విమర్శించారు.
తాజావార్తలు
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!