Varudu Kalyani: నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్ల రూపాయాలు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారు.. ఈ లెక్కన మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లు.. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి 20 వేల కోట్లకు మీ ఆస్తులు ఎలా పెరిగాయి? అంటూ నిలదీసిన ఆమె.. ఒకప్పుడు చంద్రబాబు ఆస్తి ఎంత? ఇప్పుడు ఆస్తి ఎంత? పాలమ్మితేనే 20 వేల కోట్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. జైల్లో సదుపాయాలు ఉన్నాయో లేదో చంద్రబాబుని అడిగితే చెబుతారని సూచించారు. చంద్రబాబు, భువనేశ్వరి ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నాం అని చెబితే జనం నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అయితే, రేపటి అసెంబ్లీ సమావేశానికి టీడీపీ నేతలు హాజరు కావాలి.. సీబీఐ ఎంక్వైరీ వేయమని అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.
Read Also: Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఆ విభాగంలో స్వర్ణం