సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి... అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు. నన్ను కాదని మీరు ఓటు వేస్తారా... మే వరకూ నేను ఉంటాను వేయండి చూద్దాం అని అక్కడి జనాలను ఉద్దేశించి అన్నారు.
పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు.
రాష్ట్రంలో విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ, ధరలు పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు..
టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది.
ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.