ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.
నేడు ఎన్నికల సంఘాన్ని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ బృందం కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారు అనే అంశంపై డేటాను ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు ఇవ్వనున్నారు.
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.