రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు ' రా కదలిరా' సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు ముందే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ సభకు.. ఏవి సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆయన వస్తే రచ్చ రచ్చే అని అంటున్నారు. తాను సైలెంట్ గా ఉన్నా, అనుచరులు ఊరుకోరని భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి ముందు చెప్పింది అఖిల…
కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ - గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ,…
ఏపీలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని తెలిపారు. వారి డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసినంత ఉండొచ్చని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై…
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో…
టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం అని తెలిపారు.
ఇసుక వ్యాపారం, పంచాయితీలు, భూ దందాలు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ సంపాదనపై పడ్డారు తప్ప.. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి.
ముందు విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తాను.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత..