చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి.
పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబాలు సైకిల్ దిగాయి. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.