టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..
మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. ఇది తనపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలిపారు.
ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపలో టికెట్ దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో పక్క పార్టీల్లో నుంచి అధికార వైసీపీలోకి కూడా వస్తున్నారు. అయితే, తాజాగా విజయవాడలో సంక్రాంతి పండగ రోజు ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా ఫ్లెక్సీల వార్ సాగుతుంది.