టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్‌గా ఫోకస్…
ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని…
నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.