విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న హెపటైటిస్ ప్రభావిత విద్యార్థినులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి ఈరోజు పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలతో మంత్రి మాట్లాడారు. వారి ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన పిల్లలకు నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు కొందరు హెపటైటిస్–ఏతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Also Read: Viral Video: తాకరాని చోట తాకిన బంతి.. అల్లాడిపోయిన కేఎల్ రాహుల్!
‘కేజీహెచ్ ఆస్పత్రిలో ఆరుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు. కురుపాంలో వాటర్ ప్రాబ్లం లేదు. కురూపం హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఉంది. అన్ని గురుకులాల్లో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని నిర్ణయించాం. రూ 90 కోట్లు సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. పిల్లల ఆరోగ్యం బాగోకపోతే రాజకీయం చెయ్యడం ఏంటి?. 146 మంది పిల్లలు బాగా ఉన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే నాకు చెప్తే సరి చేసుకుంటాం. చనిపోయిన పిల్లలకు నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు’ అని మంత్రి గుమ్మడి సంధ్య రాణి చెప్పారు.