బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న�
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుఫున వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనమే అయినా పోటీ మాత్రం తప్పదని తెలుస్తోంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయ�