ఏపీలో రాజధాని రగడకు తెరపడినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు కావడంతో విచారించిన హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. పెద్దవాడిగా సీఎం జగన్‌కు చెబుతున్నా, జరిగింది జరిగిపోయింది.. ఇకనైనా అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే…