గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు నియమితులపైన విషయం తెలిసిందే. నేడు ఆయనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియామకంపై అశోక్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు.
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. విజయవాడ టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం గుండె నొప్పితో ప్రయివేట్ ఆసుపత్రి లో చేరిన బాబుకి వైద్యం అందించారు. కానీ సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు. గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు…