గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…
కార్మికులకు, కర్షకులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో…
సంచలనం కలిగించిన రమ్య హత్య కేసులో న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఉన్మాద వ్యక్తులకు చెంపపెట్టులాంటిదన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చదువుకునే ఆడపిల్ల ను క్రూరం గా హత్య చేయడంతో రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోయారు. ఈ హత్య జరిగిన వెంటనే మా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ ఉదారంగా ఆదుకున్నారన్నారు మంత్రి నాగార్జున. హంతకుడిని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం , అధికారులు బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి…