మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ... ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది... ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది... అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం..