టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలతో రేగిన రాజకీయ కాక.. ..క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన రాజకీయ ఉద్రిక్తతల సెగ.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. హస్తినలోనూ పైచేయి సాధించాలని ఇరుపక్షాలు.. వ్యూహాలకు తెరలేపాయి. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభి నిన్న రాత్రి బెయిల్‌పై రిలీజయ్యారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పట్టాభికి 14 రోజుల జ్యుడీషియల్…