తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న సమస్యలకీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా `సంజీవని ఆరోగ్య రథం` పేరుతో మొబైల్ ఆస్పత్రి ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు.