Budda Venkanna : టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న తాజాగా కొన్ని హాట్ కామెంట్ చేసారు. ఇందులో భాగంగా పదవి జ్వరం లాంటిది వస్తుంది.. పోతుంది…, టీడీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరని ఆయన పేర్కొన్నాడు. నాని ఎంపి నామినేషన్ విత్ డ్రా అయ్యాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకిగా మాట్లాడాడు. మేము నానికి వ్యతిరేకులం.. పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం…
ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది.…
టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్‌చార్జ్‌లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు. పని చేయని ఇన్‌చార్జ్‌లు…
ఆయన మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నేత. ఆ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఇంఛార్జ్ పదవిని పీకేసింది పార్టీ. కొత్త నాయకుడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఎందుకీ మార్పు? మాజీ ఎమ్మెల్యే ఎందుకు రుచించలేదు? టీడీపీ ఇంఛార్జ్ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే తొలగింపు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూలుతున్నాయి. కేడర్ చెల్లాచెదరవుతోంది. ఇలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం ఫోకస్ పెడుతోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు…
నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట. రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. తర్వాత పోటీ చేసి ఓడిపోయింది మాత్రం మూడుసార్లు. టీడీపీ ఆయన్నే నమ్ముకుందో ఏమో.. ఓడినా ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది. విచిత్రం ఏంటంటే.. సొంత పార్టీ కేడర్ ఆయన్ని ఓన్ చేసుకోదు. కేడర్ వర్సస్ లీడర్ అన్నట్టుగా అక్కడ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? రోడ్డున పడుతున్న నూజివీడు టీడీపీ రాజకీయాలు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌కు, కేడర్‌కు మధ్య…