CM Chandrababu : వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాల కారణంగా అస్తవ్యస్థంగా మారిన పోలవరానికి కూటమి ప్రభుత్వం జీవం పోసి పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడి హెలిప్యాడ్ వద్ద దిగుతారు. పనుల పురోగతిని పరిశీలించిన తరువాత, ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాస అంశాలపై అధికారులతో సమావేశమవుతారు. తాను…
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట... లేకపోతే కేసులు పెడతారంట ...హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు.
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు.