నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు.
ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న…