Tata Punch Facelift:టాటా పంచ్ తన ఆరంభం నుంచి బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ కాలక్రమేణా ఈ ఎస్‌యూవీకి కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, డిజైన్ మాత్రం పెద్దగా మారలేదు. ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ పంచ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలు ఈ కొత్త మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి.