దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,…
ఎలక్ట్రిక్ కార్లపై (EV) బంపర్ డిస్కౌంట్ల సీజన్ కొనసాగుతోంది. వాస్తవానికి.. డీలర్‌షిప్ మిగిలిన స్టాక్‌ను విక్రయించేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టాయి. 2024 సంవత్సరం ప్రారంభంలో విడుదలైన టాటా పంచ్ ఈవీపై గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ద్విచక్ర వాహనాలపై కూడా స్టాక్ క్లియరెన్స్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి.
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
శంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు 'టాటా పంచ్ ఈవీ'ని విడుదల చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు, రెండు విభిన్న డ్రైవింగ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఈవీ కారు అని కంపెనీ పేర్కొంది.
Tata Punch.ev: టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్‌గా టాటా ఉంది. ఇప్పటికే టాటా నుంచి టియాగో, టిగోర్, నెక్సాన్ ఈవీలు రాగా.. ఇప్పుడు టాటా పంచ్ ఈవీని తీసుకువస్తోంది. ఈ కార్‌పై జనాల్లో చాలా ఆసక్తి ఉంది. పంచ్ ఈవీ పూర్తిగా ఈవీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది టాటా. జనవరి 17న Tata Punch.ev లాంచ్ కాబోతోంది.
భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది.
టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.
దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతరం కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో సందడి చేస్తోంది. రానున్న రోజుల్లో దేశీయ విపణిలోకి అనేక కొత్త కార్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.
Tata Punch EV: ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఇండియాలోనే టాటా తోపుగా ఉంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ని పరిశీలిస్తే దీని దరిదాపుల్లో కూడా ఇతర కార్లు లేవు. ఇప్పటికే టాటా నుంచి టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇండియాలోనే నెక్సాన్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇప్పటికే టాటాలో హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో ఈవీ, సెడాన్ లో టిగోర్ ఈవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీలో…
Tata Punch EV to be launched in India: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల అమ్మకాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఎలక్ట్రిక్ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈవీ కార్ల విభాగంతో దేశంలోనే టాప్ లో ఉంది దేశీయ కార్ మేకర్ దిగ్గజం టాటా. టాటా నెక్సాన్ ఈవీ తర్వాతే.. ఇతర కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటానే అగ్రస్థానంలో ఉంది.…