టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల బడ్జెట్ తో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇవి బెస్ట్.
టాటా టియాగో ఈవీ ..
టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే, తొలి 10 వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది కంపెనీ వెల్లడించలేదు.
ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర..
ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీన్ని ఇంట్రడక్టరీ ధరగా ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఈ స్మాల్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ వచ్చింది. ఈ కారు లెంగ్త్ 2,974 మీల్లీమీటర్లు (mm)గా ఉంది. పొడవు 1,640 mm, వెడల్పు 1505mmగా ఉంది. 12 ఇంచుల వీల్‍లతో ఈ కారు వచ్చింది. టూ డోర్ మోడల్‍గా అడుగుపెట్టింది. ఈ కారు17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా ఈ కారు రేంజ్ ఉంటుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‍లతో ఈ నయా ఎలక్ట్రిక్ కారు వచ్చింది. సింగిల్ మోటార్‌లో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది. 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ఇది ప్రొడ్యూజ్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది.
టాటా పంచ్ ఈవీ ..
టాటా పంచ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ. దీన్ని కేవలం 56 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు 9.5 సెకన్లలో 0-100 కి.మీల వేగాన్ని అందుకోగలదు. ఈ ఈవీ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 10.25 అంగుళాల టచ్ డిస్‌ప్లేతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంది. టాటా పంచ్ ఈవీ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు.