Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తమిళనాడు సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (TASMAC) ఆధ్వర్యంలో నిర్వహించే 500 లిక్కర్ షాపులను మూసి వేస్తున్నట్టు.. తమిళనాడు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ ప్రకటిచింది.. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. తొలి విడతలో స్కూళ్లు, టెంపుల్స్ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేస్తున్నట్టు పేర్కొంది.
ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట..…
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ…