Rakhi Sawant Marriage – Taslima Nasreen comments: వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మరోసారి ఇస్లాంపై వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఛాందసవాదాన్ని ఎదురించిన తస్లిమా సొంత మతం నుంచే బెదిరింపులు, దాడులకు గురైంది. ఇస్లాంలోని తప్పులను ఎత్తి చూపడంలో ముందుంటారు. ఇదిలా ఉండే ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్య్రం, స్త్రీల సమానత్వం, ముస్లిమేతర హక్కులు మొదలైనవాటిని అంగీకరించాలని లేకపోతే ఆధునిక సమాజంలో దీనికి స్థానం ఉండదని అన్నారు.
Read Also: MP Saumitra Khan: స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడు.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
దీంతో పాటు బాలీవుడ్ యాక్టర్ రాఖీ సావంత్ వివాహంపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. రాఖీ సావంత్ ఆదిలో ఖాన్ దుర్రానీని వివాహం చేసుకున్నారని.. ముస్లిం అయిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు రాఖీ సావంత్ ఇస్లాంలోకి మారాల్చి వచ్చిందని అన్నారు. అయితే ఆమె పేరును ఫాతిమాగా మార్చుకుందా అనేది ధృవీకరించబడలేదు. రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో కనిపించాయి. అలాగే వివాహ ధృవీకరణ పత్రంకు సంబంధించిన ఫోటోలో రాఖీ పేరు రాఖీ సావంత్ ఫాతిమాగా ఉంది. దీనిపై రాఖీ సావంత్ ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మతం మారాల్సి వచ్చిందని చెబుతూ ఈ కామెంట్స్ చేశారు. రాఖీ సావంత్ గతేడాది ఆదిల్ తో రహస్య వివాహం జరిగిందని అంగీకరించారు. అయితే ఆదిల్ మాత్రం ఈ పెళ్లిని, ఫోటోలను ఖండించారు. అయితే రాఖీ సావంత్ తన పేరును ఫాతిమా మార్చుకుందో లేదో తనకు తెలియదని ఆమె సోదరుడు అన్నాడు. అయితే గతేడాది రాఖీ సావంత్ ఇంటిలో నిఖా జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.