Jammu Kashmir: సార్వత్రిక ఎన్నికల వేళ టెర్రరిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో టార్గెటెడ్ కిల్లింగ్‌కి పాల్పడ్డాడు. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీని లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్‌కి చెందిన వలసకూలిని చంపినట్లుగా బుధవారం అధికారులు తెలిపారు. మృతుడిని రాజు షాగా గుర్తించారు.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ పోలీసును ఉగ్రవాదులు అతని ఇంటిలోనే కాల్చిచంపారు. లోయలో గత మూడు రోజుల్లో ఇది మూడో లక్షిత దాడి కావడం గమనార్హం. బారాముల్లాలోని కరల్‌పోరా గ్రామంలోని కానిస్టేబుల్ గులాం మహ్మద్ దార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.