ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన తనిష్క్ రాజన్ ఇప్పుడు 'నేనెవరు' మూవీలో నటిస్తోంది. డిసెంబర్ 2న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. రంగస్థలం నుండి సినిమాల్లోకి వచ్చిన తనిష్క్ ఈ సినిమాలోని పాత్ర తనకు గుర్తింపు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.