టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చహల్ తన ఖాతా నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఇప్పటివరకు తమ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు యుజ్వేంద్ర…