టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చహల్ తన ఖాతా నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఇప్పటివరకు తమ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఓ వైపు యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మల విడాకుల అంశం చర్చనీయాంశంగా మారగా.. తాజాగా యూజీకి సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముంబైలోని జేడబ్ల్యూ మారియల్ హోటల్‌లో ఓ మిస్టరీ గర్ల్‌తో చహల్ కనిపించాడు. హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియా కెమెరాలను చూసి తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. చహల్ ముందు సండుస్తుండగా.. అమ్మాయి అతడి వెనకాల ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కెమెరా కంటపడకుండా ఉండేందుకు యూజీ ఆపసోపాలు పడడంతో.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందనే సందేహాలు మొదలయ్యాయి.
Also Read: Gold Rate Today: పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
ఆ మిస్టరీ గర్ల్ పేరు తనిష్క కపూర్ అని తెలుస్తోంది. ఆమె కన్నడలో 2-3 సినిమాల్లో నటించినట్లు సమాచారం. ధనశ్రీ వర్మతో పరిచయం కాకముందే.. చహల్, తనిష్కలు డేటింగ్ చేసినట్లు తెలుస్తోని. ఈ వార్తలను అప్పట్లో యూజీ ఖండించాడు. పెళ్లి తర్వాత కూడా తనిష్కతో చహల్ సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నాడని తాజాగా అర్ధమవుతోంది. అంతేకాదు తనిష్క కారణంగానే చహల్, ధనశ్రీ మధ్య గొడవలు మొదలయ్యాయనే వాదను కూడా ఉంది. చహల్ వ్యవహారం నచ్చకనే ధనశ్రీ విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందని తెలుస్తోంది. కొంతకాలం ప్రేమలో ఉన్న చహల్, ధనశ్రీలు 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ధనశ్రీ దంత వైద్యురాలు మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పాల్గొంది.