ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి…
ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు…