సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.
నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని భారతి చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
CM Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపణలు చేశారు.
ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో, అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్టులో బులెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా 50 కి పైగా ఫేక్ కాల్స్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం. తాజాగా తెలంగాణలోని…
LPG Cylinder Explodes: తమిళనాడులోని తిరునెల్వేలి పట్టణంలోని సమోసా దుకాణంలో గురువారం సాయంత్రం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. నివేదికల ప్రకారం., వడక్కు రథవీధిలోని ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. దాంతో ఆ షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో మంటలు సమీపంలోని వ్యాపారులకు వ్యాపించాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్…
తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.