Tamilnadu: తమిళనాడులోని తిరువొత్తియూర్ కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవను నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా వాహనం పక్కకు వాలిపోయింది. గరుడ వాహనాన్ని మోసే కర్ర బలంగా లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొందరు సిబ్బంది, అర్చకుడికి స్వల్పగాయాలయ్యాయి. అనంతరం అందరూ లేచి మళ్లీ స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా కొత్త వాహనం, కొయ్యలను అధికారులు తీసుకురాలేదని ఆలయ సిబ్బంది వాపోతున్నారు. అధికారుల వల్లే అపశ్రుతి అంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Husband Attack: భార్యపై అనుమానంతో కత్తితో దాడి.. దేహశుద్ధి చేసిన స్థానికులు