ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో, అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్టులో బులెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా 50 కి పైగా ఫేక్ కాల్స్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం. తాజాగా తెలంగాణలోని ప్రజాభవన్ లో, అలాగే నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబు ఉన్నట్లుగా ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి కూడా మీడియా ద్వారా తెలుసుకున్నాము. కాకపోతే ఇదంతా ఫేక్ గా జరుగుతోంది.
Komatireddy: మేడిగడ్డ ప్రపంచంలో వింత అన్నాడు.. నిజమే 3 నెలలకు కూలింది వింతే..!
ఇలా ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక మూలన దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా చెన్నై విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే సినీ నటుడైన కరుణాస్ హ్యాండ్ బ్యాగ్ లా దాదాపు 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ విషయం సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరుణాస్ పొరపాటున బులెట్లు తనతో తీసుకోవాల్సినట్లు విచారణలో పేర్కొన్నారు. చూడాలి మరి దీనిపై ఎయిర్ పోర్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో.
40 bullets found in Chennai airport with famous actor in Tamilnadu karunas