నిన్న మధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూనూరు వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు సమీపంలో కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న కూలి శివ అనే వ్యక్తి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంటల్లో కాలిపోతున్న ఓ వ్యక్తిని చూశానని, మంచినీళ్లు అడిగారని, అయితే, నీళ్లు ఇవ్వకుండా గుడ్డలో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించానని, మూడు గంటల తరువాత చనిపోయి ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని, దేశానికి ఎంతో సేవచేసిన వ్యక్తికి తాను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయామని కంటతడి పెట్టుకున్నారు.
Read: ఒమిక్రాన్ వేరియంట్ పై డబ్ల్యూహెచ్ ఓ కీలక ప్రకటన
రాత్రంతా తనకు నిద్రపట్టలేదని ఆ ప్రత్యక్షసాక్షి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు. సల్లూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, మరో 11 మంది ఆర్మీ అధికారులు మృతి చెందారు.