Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించాయి. మార్చి/ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షం ఎండీఎంకే అధినేత వైకో తిరుచిరాపల్లి కేంద్రంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన ప్రచార బ్యానర్‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఉండటం సంచలనంగా మారింది.
Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం…