Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు.
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అన్నామలై నిర్ణయం షాక్‌కి గురిచేసింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గత వారం అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలోనే అన్నామలై పార్టీ…
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నంటున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.