ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన…
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా…
తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం…
విజసేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మహారాజ’. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో సంచనాలు నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయసేతుపతి నటనకు తమిళ్ తో పాటు తెలుగు రాష్టాల ప్రేక్షకులు కూడా భ్రమరథం పట్టారు.తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. మహారాజ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఎన్వీ ప్రసాద్. ఏపీ, తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో సుపర్ హిట్…
తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన…
బాలా ఈ దర్శకుడు పేరు ఒకప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు పరిశ్రమల్లో బాగా వినిపించేది. యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు…
విక్రమ్ తాజా చిత్రం తంగలాన్, పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్…