ఈకమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్”. హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా “థగ్ లైఫ్” జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు ‘థగ్ లైఫ్’ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన మీడియా మీట్‌లో దర్శకుడు మణిరత్నం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read: Kamal Haasan : నేను ద్రోణాచార్యుడిని కాదు, ఇంకా విద్యార్థినే
మీడియా మీట్‌లో మణిరత్నం మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. కమల్ హాసన్‌తో ‘నాయకన్’ సినిమా చేసినప్పుడు మొదటిసారి కలిసి పనిచేశాం. ‘మౌనరాగం’ సినిమా పూర్తయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉండగా, నిర్మాత ముక్తా శ్రీనివాసన్ ఒక హిందీ సినిమా క్యాసెట్ ఇచ్చి, దాన్ని తమిళంలో రీమేక్ చేయమన్నారు. నాకు రీమేక్‌లపై ఆసక్తి లేదని, అదే విషయం కమల్ హాసన్‌తో చెప్పమన్నారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన నీవు ఏ సినిమా చేయాలనుకుంటున్నావో అది చేద్దామని చెప్పారు. అలా ‘నాయకన్’ ఆవిర్భవించింది.
Also Read: Vijay Kanakamedala : పవన్, చిరు ఫ్యాన్స్ కు ‘భైరవం’ డైరెక్టర్ క్షమాపణలు..
‘థగ్ లైఫ్’ కూడా అలాంటి సందర్భంలోనే పుట్టింది. కమల్ హాసన్ ఒక రోజు కాల్ చేసి, కలిసి మరో సినిమా చేద్దామని చెప్పారు. అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. కమల్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ‘నాయకన్’ సమయంలో ఆయన ఎలా ఉండేవారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. దర్శకుడిగా నేను పనిచేయడం మొదలుపెట్టకముందు నుంచి ఆయన్ని చూస్తున్నాను, ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకుని, సపోర్ట్ చేసే అద్భుతమైన హీరో ఆయన” అని అన్నారు.