సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
Also Read: Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం గతంలో రూపొందించిన ‘నాయకన్’ సినిమా గురించి మాట్లాడుతూ, ఆ సినిమా ముందు తనకు మణిరత్నం ఎవరో తెలియదని సుహాసిని చెప్పుకొచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత మణిరత్నంతో ఫోన్‌లో పావుగంట సేపు మాట్లాడానని, ఆ సమయంలో “ఆయన గొంతు కోసేసాను” అంటూ సరదాగా కామెంట్ చేసింది. “ఆ కాల్ మాట్లాడిన తర్వాత నేను ఎంతో ఆలోచించాను. అసలు ఈ మణిరత్నం ఎవరు? నేనెందుకు పావుగంట మాట్లాడాను?” అని ఆలోచించానని ఆమె తెలిపింది. అంతేకాక, మణిరత్నం ‘నాయకన్’ సినిమా చేయకపోతే, తన జీవితంలో సుహాసిని ఉండేది కాదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.