సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, రజనీకాంత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కీలక పాత్రలో నటిస్తున్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమే అని బాలయ్య ఆ పాత్ర చేయడం లేదని కూడా ఈ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య అతిథి పాత్రలో నటిస్తున్నారు.
Also Read:Rana Naidu 2: నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే?
‘జైలర్ 2’లో బాలకృష్ణ 10 నిమిషాల నిడివి గల ఒక పవర్‌ఫుల్ కామియో రోల్‌లో కనిపించనున్నారు. ఈ 10 నిమిషాల పాత్రలో ఒక హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు, రజనీకాంత్, శివరాజ్‌కుమార్ వంటి మిగతా స్టార్స్‌తో కలిసి ఒక ఆల్-స్టార్స్ కాంబినేషన్ సీన్‌లో బాలయ్య నటించనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ మూమెంట్స్‌ను అందించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా 22 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా, సన్ పిక్చర్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటున్న బాలకృష్ణ, ‘జైలర్ 2’లో తనదైన మాస్ మార్క్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read:Mayabazar: మళ్ళీ తెరమీదకి “మాయాబజార్ “
‘జైలర్ 2’ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్, ఎస్.జె. సూర్య తదితరులు నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ ఆర్. నిర్మల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. బాలకృష్ణ, రజనీకాంత్ కలయిక అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని, ఈ 10 నిమిషాల సీన్ సినిమాలో హైలైట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ‘జైలర్ 2’ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.